ఆర్ధికేతర ఫైళ్లను పెండింగ్‌లో ఉంచరాదు : సీఎం చంద్రబాబు
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలస్యానికి గల కారణాలపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్ధికేతర ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచరాదని స్పష్టం చేశారు.ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లుంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు.
ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు, ఏడాది వరకు ఉంచుకుంటున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్సు అవుతున్నాయని, మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్య అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈవో దినేష్ కుమార్ వివరణ ఇచ్చారు.