Telugu Global
Andhra Pradesh

తెలుగుని ఖూనీ చేశారు.. కాదు మీరే చేశారు

తెలుగుని మీరు ఖూనీ చేశారంటే, కాదు మీ నాయకుడే ఖూనీ చేశారంటూ టీడీపీ, వైసీపీ నిందలు వేసుకున్నాయి.

తెలుగుని ఖూనీ చేశారు.. కాదు మీరే చేశారు
X

స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా టీడీపీ, వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ మధ్య గొడవ జరిగింది. జెండా వందనంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రసంగం తప్పుల తడక అంటూ వైసీపీ ట్వీట్ వేసింది. దీనికి ప్రతిగా టీడీపీ కూడా పాత జ్ఞాపకాలు గుర్తు చేసింది. గతంలో జగన్ డైలుగుల్ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తూ మరో ట్వీట్ వేసింది. ఇలా ఈరోజు కూడా సోషల్ మీడియా యుద్ధాన్ని కంటిన్యూ చేశాయి టీడీపీ, వైసీపీ.


ఇటీవల టీడీపీ, వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో వాడుతున్న భాష మరీ అభ్యంతరకరంగా ఉంటోంది. నిక్కర్ మంత్రీ అంటూ నారా లోకేష్ ని వైసీపీ టార్గెట్ చేస్తే, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ జగన్ ని టీడీపీ మరింత దారుణంగా ట్రోల్ చేస్తోంది. గతంలో ట్వీట్ కి రిప్లై రావాలంటే కాస్త టైమ్ తీసుకునేవారు. ఇప్పుడు గంటల వ్యవధిలోనే మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇటీవల నారా లోకేష్ విదేశీ యాత్రపై వైసీపీ ట్వీట్ వేయగా, నేరుగా లోకేష్ దానికి రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ అఫిషియల్ హ్యాండిల్ దాన్ని కంటిన్యూ చేయగా, తర్వాత టీడీపీ నుంచి వరుస రియాక్షన్లు వచ్చాయి.


ఇక వీడియోల విషయంలో ఎవరికి నచ్చినట్టు వారు ఎడిట్ చేసుకుంటూ సినిమా క్లిప్స్ యాడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల జగన్ ప్రెస్ మీట్లను వరుసగా టీడీపీ ట్రోల్ చేసింది. తాజాగా లోకేష్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ని వైసీపీ కార్నర్ చేసింది. తెలుగుని మీరు ఖూనీ చేశారంటే, కాదు మీ నాయకుడే ఖూనీ చేశారంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు.

First Published:  15 Aug 2024 5:58 PM IST
Next Story