Telugu Global
Andhra Pradesh

లోకేష్‌ వాట్సాప్‌ బ్లాక్ చేసిన మెటా!

వేలాదిగా మెసేజ్‌లు వస్తుండడంతో వాట్సాప్‌ తరచూ బ్లాక్ అవుతోందని, దీంతో చాలా మంది మెసేజ్‌లు తాను చూడలేకపోతున్నానని చెప్పారు.

లోకేష్‌ వాట్సాప్‌ బ్లాక్ చేసిన మెటా!
X

మంత్రి నారా లోకేష్‌ వాట్సాప్‌ను మెటా బ్లాక్ చేసింది. ఈ మేరకు లోకేష్‌ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మెసేజ్‌లు రావడంతో వాట్సాప్‌ను మెటా బ్లాక్ చేసిందని ఆయన పేర్కొన్నారు. తన వాట్సాప్‌కు ట్రాఫిక్‌ కంట్రోల్ చేయడం కష్టంగా మారిందని మెటా తెలిపిందన్నారు. పాదయాత్రలో యువతకు తనను చేరువ చేసిన హలో లోకేష్‌ కార్యక్రమం పేరుతోనే మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in క్రియేట్ చేసుకున్నానని చెప్పారు. ఇకపై ఏమైనా సమస్యలు ఉంటే hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీకి పంపాలని విజ్ఞప్తి చేశారు లోకేష్‌.



వేలాదిగా మెసేజ్‌లు వస్తుండడంతో వాట్సాప్‌ తరచూ బ్లాక్ అవుతోందని, దీంతో చాలా మంది మెసేజ్‌లు తాను చూడలేకపోతున్నానని చెప్పారు. ఇకపై ఏమైనా సమస్యలు ఉంటే మెయిల్‌కు పంపాలని సూచించారు లోకేష్‌. పేరు, ఊరు, ఫోన్‌ నంబర్‌ సమస్య - కావాల్సిన సహాయం రాసి మెయిల్ చేస్తే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ మెయిల్‌ను స్వయంగా తానే హ్యాండిల్ చేస్తానన్నారు. సాయం కోసం వచ్చే ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్‌ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రతి రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇటీవల తన వాట్సాప్‌కు వచ్చిన ఓ మెసేజ్‌కు రియాక్ట్ అయి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించారు.

First Published:  11 July 2024 12:09 PM GMT
Next Story