తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ఏపీలో తల్లికి వందనం త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ఏపీలో తల్లికి వందనం రూ.15000 అన్నదాత సుఖీభవ రైతులకు రూ. 20,000 పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. ఏప్రిల్, మే, నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎలక్షన్‌లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా ఏడాదికి రూ.250 చొప్పున పెంచిందని లోకేశ్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి అవసరం అని.. అందుకే తాము బేషరతుగా ఎన్డీఏలో చేరామన్నారు. ఐదేళ్లలో మీరు తీసుకురాలేని నిధులు తాము 9 నెలల్లో తెచ్చామని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి లోకేస్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయన్నారు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వచ్చే సరికి రెండు, మూడు ఏళ్లు పడుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించామని మాత్రమే తాము చెప్పామని.. ఉద్యోగాలు ఇచ్చామని తాము ఎక్కడా చెప్పలేదని వివరణ ఇచ్చారు.