బొత్స కామెంట్స్‌పై షర్మిల ఫైర్
తనపై మాజీ మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌పై వైఎస్.షర్మిల మండిపడ్డారు.

వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో పని చేయకుండా రాష్ట్ర సంపదను దోచుకుతిన్నది ఎవరో ప్రజలకు తెలుసు అని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జైలుకు వెళ్లి ఖైదీలను పరామర్శించడానికి సమయం ఉందిగానీ.. శాసన సభకి వెళ్ళడానికి ధైర్యం లేదు అని నిన్న షర్మిల చేసిన కామెంట్స్‌పై బొత్స స్పందిస్తూ ఆమెకు పని లేదు.. ఖాళీగా కూర్చొని ట్వీట్‌లు పెట్టేదానికి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ తేలిగ్గా తీసిపారేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు షర్మిలకు కనిపించవని..ఎంతసేపు మాజీ సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించమే పనిగా పెట్టుకుందని బొత్స విమర్శించారు. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో... రాష్ట్ర ప్రజానీకానికి తెలుసంటూ జగన పాలనపై మరోసారి షర్మిల నిప్పులు కక్కారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని..పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని..151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని..చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారని షర్మిల గుర్తు చేశారు.