బాబు, లోకేష్, జగన్.. ఎవరెవరు ఎంత తింటారు..?
వైసీపీ, టీడీపీ ట్వీట్లు రోజు రోజుకీ మరింత పర్సనల్ గా మారిపోతున్నాయి. ఇరు పార్టీల వీడియోలతో నెటిజన్లకు మాత్రం మంచి వినోదం దొరికింది.
అన్న క్యాంటీన్ల ప్రారంభంపై వైసీపీ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ట్వీట్ తో తిరిగి వైసీపీనే టార్గెట్ చేసింది టీడీపీ. అసలు వైసీపీ చేసిన కామెంట్ ఏంటి..? టీడీపీ దానికి ఇచ్చిన కౌంటర్ ఏంటి..? ఓసారి మీరే చూడండి.
అయ్య రెండు స్పూన్లు అన్నం తిన్నాడు..
కొడుకు పావు ముక్క ఇడ్లీతో సరిపెట్టాడంటూ..అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో చంద్రబాబు, లోకేష్ ఆహారం తీసుకోవడంపై వైసీపీ వెటకారంగా స్పందించింది. పేదలకు పెట్టే అన్నం, టిఫిన్ కాబట్టి తండ్రీ కొడుకులిద్దరికీ ముద్ద దిగలేదని వైసీపీ అఫిషియల్ అకౌంట్ ద్వారా కౌంటర్ ఇచ్చింది. వాళ్లు పెడుతున్న ఆహారంపై వారికే నమ్మకం లేదని దెప్పిపొడిచింది. ప్రజలతో కలిసిపోవడం, వాళ్లు తినే అన్నం ముద్దను వాళ్లతోనే కలిసి పంచుకోవడం అంటే ఫొటోలు దిగినంత ఈజీ కాదని తేల్చి చెప్పింది వైసీపీ.
అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో...
— YSR Congress Party (@YSRCParty) August 16, 2024
అయ్య రెండు స్పూన్లు అన్నం తింటే,
కొడుకు పావు ముక్క ఇడ్లీతో సరిపెట్టాడు.
ఎందుకంటే... అది పేదలకు పెట్టే ఆహారం.
పైగా ఐదు రూపాయలకు పెడుతున్న ఆహారం.
ఆకలి తీర్చే ఆహారాన్ని తక్కువ చేయడం కాదు కానీ... తమ ప్రభుత్వం పెడుతున్న భోజనం మీద ఈ తండ్రీ… pic.twitter.com/iVdKybdqR9
మీ సంగతేంటి..?
చంద్రబాబు, లోకేష్ పై వేసిన సెటైర్లకు టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. గతంలో జగన్ పాదయాత్రలో ఓ పేద కుంటుంబాన్ని ఓదార్చి వారి ఇంట్లో అన్నం తినే వీడియోని టీడీపీ ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేసింది. అప్పట్లో జగన్ ఓ రేంజ్ లో నటించారని, అలా నటించడం తమ నాయకులకు చేతకాదని అంతే వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పై వైసీపీ ఏడుపు చూస్తుంటే, ప్రజలు ఆ పార్టీకి 11 కాదు, 1 ఇచ్చినా తప్పు లేదని టీడీపీ విమర్శించింది.
పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పై నిన్నటి నుంచి, నువ్వు ఏడుస్తున్న ఏడుపు చూస్తుంటే, నీకు ప్రజలు 11 కాదు, 1 ఇచ్చినా తప్పు లేదు.
— Telugu Desam Party (@JaiTDP) August 16, 2024
చంద్రబాబు గారు, లోకేష్, ప్రజలతో కలిసిపోయే వారు కాబట్టే, ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. నీకు ప్రజలంటే చీదరతో, ప్యాలెస్ లో కులికావు కాబట్టే నీకు 11… https://t.co/St7BBOF5TQ pic.twitter.com/PHzR6nsLIm
వైసీపీ, టీడీపీ ట్వీట్లు రోజు రోజుకీ మరింత పర్సనల్ గా మారిపోతున్నాయి. ఆగస్ట్ 15న స్పీచ్ లో తప్పులున్నాయని, అన్న క్యాంటీన్ లో లోకేష్ అర ఇడ్లీతో సరిపెట్టారని.. ఇలాంటి వాటన్నిటినీ హైలైట్ చేయాలనుకుంటోంది వైసీపీ. అదే సమయంలో పాత వీడియోలు వారికి కౌంటర్లుగా మారుతున్నాయి. ఇరు పార్టీల వీడియోలతో నెటిజన్లకు మాత్రం వినోదం మిగిలింది.