Telugu Global
Andhra Pradesh

ఇక ప్రభుత్వ సమాచారం అంతా వెబ్ సైట్ నుంచే

వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు ఇచ్చేందుకు కార్యచరణ రూపొందిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఇక ప్రభుత్వ సమాచారం అంతా వెబ్ సైట్ నుంచే
X

ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వాట్సాప్ గవర్నన్స్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా వచ్చేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు ఇచ్చేందుకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. మరో 10 రోజుల్లో ఈ సేవలు ప్రారంభం అవుతాయని లోకేశ్ తెలిపారు. జనన, మరణాల ధృవీకరణ పత్రాల జారీకి పాటిస్తున్న విధానం పై సమీక్షించాలన్నారు. విద్యాశాఖలో ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ ఐడీ జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరి చేస్తున్నట్టు పేర్కొన్నారు. విధానాలను సగం నుంచి డిజిటలైజ్ చేయడమే కాకుండా పూర్తిగా వాటి ప్రాసెస్ ను రీ-ఇంజినీరింగ్ చేయాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో యూఏఈ మాత్రమే ఒకే ప్లాట్ ఫాం పై పౌరసేవలు అందిస్తోందన్నారు. ప్రభుత్వ సమాచారం ఒకే చోట ఉండేవిధంగా www.ap.gov.in అధికారిక వెబ్ సైట్ లో పొందు పరుస్తామని వెల్లడించారు.

First Published:  11 Dec 2024 6:33 PM IST
Next Story