ఈ హ్యాబిట్స్ మీ అందాన్ని పాడుచేస్తాయి!
తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంటుంది. చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్ని పాత అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు కొన్ని కొత్త అలవాట్లు చేర్చుకోవాలి.
స్కిన్ కేర్‌లో భాగంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని లైఫ్‌స్టైల్ అలవాట్లు మార్చుకోకపోతే అందంగా మారడం కష్టమే అంటున్నారు. ముఖ్యంగా కొన్ని అలవాట్లు చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంటుంది. చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్ని పాత అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు కొన్ని కొత్త అలవాట్లు చేర్చుకోవాలి. అవేంటంటే..
స్కిన్‌కేర్ విషయంలో చాలామంది పట్టించుకోని విషయాల్లో బట్టలు, దిండ్లు, బెడ్‌షీట్ల శుభ్రత కూడా ఒకటి. రోజువారీ జీవితంలో చర్మాన్ని ఎక్కువగా తాకేవి బట్టలు, బెడ్ షీట్లే కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దిండు కవర్లను ఎక్కువరోజులపాటు వాడడం, సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చాలామందికి మొటిమలు ఎక్కువవుతుంటాయి.
స్కిన్ హెల్త్ ను పాడు చేసేవాటిలో మొబైల్ వాడకం కూడా ఒకటి. టాయిలెట్ బేసిన్ కంటే ఫోన్ స్క్రీన్ పైనే ఎక్కువ క్రిములుంటాయని మీకు తెలుసా? అందుకే మొబైల్ వాడే చేతులతో ముఖాన్ని తాకకుండా జాగ్రత్తపడాలి. ఫోన్ మాట్లాడేటప్పుడు మొబైల్ స్క్రీన్‌ను ముఖానికి ఆనించకుండా చూసుకోవాలి. అలాగే మొబైల్ స్క్రీన్‌ను తరచూ శుభ్రంగా చేస్తుండాలి.
స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే దానిపై పేరుకున్న డెడ్‌సెల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. నార్మల్ ఫేస్‌వాష్‌తో మృతకణాలు పోకపోవచ్చు. కాబట్టి అప్పుడప్పుడు స్క్రబ్ చేస్తే మంచిది.
చర్మ సౌందర్యాన్ని కోరుకునేవాళ్లు డైట్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాన్స్‌ఫ్యాట్స్, జంక్ ఫుడ్ వంటివి తగ్గించాలి. చర్మానికి కావల్సిన పోషణ కోసం హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. నట్స్, చేపలు వంటివి తినాలి.
ఇక వీటితో పాటు చర్మాన్ని తరచూ తాకడం, పడుకునేముందు ఫేస్ వాష్ చేసుకోకపోవడం, ఎప్పటికప్పుడు మేకప్ రిమూవ్ చేయకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం వంటి అలవాట్లు కూడా చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి.