ప్లానెట్‌ ఫ్రెండ్లీ ఫ్యాషన్‌...ఫ్యాషన్‌ పరిమళం

సంధ్య 2002లో నిఫ్ట్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా తమిళనాడులోని ప్రయోగాత్మక పట్టణం అరోవిల్లె వెళ్లడం అనుకోకుండా జరిగింది. ఆ పట్టణం తన ఫ్యూచర్‌ డెస్టినేషన్‌ అవుతుందని ఈ బెంగళూరమ్మాయికి అప్పట్లో తెలియలేదు.

Advertisement
Update:2023-01-19 18:33 IST

ప్లానెట్‌ ఫ్రెండ్లీ ఫ్యాషన్‌...ఫ్యాషన్‌ పరిమళం

సంధ్య 2002లో నిఫ్ట్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా తమిళనాడులోని ప్రయోగాత్మక పట్టణం అరోవిల్లె వెళ్లడం అనుకోకుండా జరిగింది. ఆ పట్టణం తన ఫ్యూచర్‌ డెస్టినేషన్‌ అవుతుందని ఈ బెంగళూరమ్మాయికి అప్పట్లో తెలియలేదు. ఖండాంతరాల్లో విస్తరించిన ఫ్యాషన్‌ బ్రాండ్‌ కంపెనీల్లో 15 ఏళ్ల పాటు కెరీర్‌ని స్థిరపరుచుకున్న సంధ్య తిరిగి ఆరోవిల్లెకి వచ్చి తన ఫ్యాషన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఫ్యాషన్‌ ఇండస్ట్రీ వల్ల భూగ్రహం విధ్వంసానికి గురవుతున్న కారణంగా తన వంతు బాధ్యతగా ఈ పని చేశానంటోందామె.



సంధ్య ఫ్యాషన్‌ టెక్నాలజీలో భాగంగా టెక్స్‌టైల్స్‌ అండ్‌ నాచురల్‌ ఫ్యాబ్రిక్స్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసింది. కోర్సు పూర్తయిన తర్వాత ఆరోవిల్లెకి వచ్చి కొంతకాలం గడిపింది. అక్కడే ఆమెకు భర్త దొరికాడు. మూడేళ్ల తర్వాత అతడికి ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉద్యోగం రావడంతో ఆమె కూడా తన ఫ్యాషన్‌ కెరీర్‌ రెక్కలు విచ్చుకోవాలనే ఆకాంక్షతో బయలుదేరింది. అక్కడ టామీ హిల్‌ ఫిగర్‌ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో పని చేసింది. పదిహేనేళ్లు గడిచిపోయాయి. కార్పొరేట్‌ ఫ్యాషన్‌ ఇండస్ట్రీ ఉద్యోగంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్నీ పర్యటించిన తర్వాత తన కళ్లు తెరుచుకున్నాయని, భూగ్రహానికి ఫ్యాషన్‌ ఇండస్ట్రీ కారణంగా జరుగుతున్న నష్టాన్ని వర్ణించడానికి మాటలు చాలవని చెప్పింది సంధ్య.



కాలుష్య నది

‘‘ఒక ప్రాజెక్ట్‌ కోసం 2013లో దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఈరోడ్‌ దగ్గర కావేరీ నది తీరాన్ని చూశాను. ఆ నీటి కాలుష్యాన్ని కొలిచే కొలమానం ఉండదంటే అతిశయోక్తి కాదు. నాలో అంతఃసంఘర్షణ మొదలైన క్షణం అది. మూడేళ్లకు ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. సస్టెయినబుల్‌ ఫ్యాషన్‌ స్పేస్‌ గురించి అధ్యయనం మొదలుపెట్టాను. నా ఆలోచనలకు గమ్యం ఆరోవిల్లెలోనే ఉందనిపించింది. ఎకో ఫ్రెండ్లీ దుస్తులను తయారు చేసి నాకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకోగలననే నమ్మకం వచ్చింది. మొక్కలు, ఆకులు, పువ్వుల మీద పరిశోధించి 2020 నాటికి సహజమైన రంగుల అద్దకం మొదలు పెట్టాను. మందార నుంచి అటవీ మొక్కల వరకు అన్నీ నా కలర్‌ మెటీరియల్సే.



పని నేర్చుకున్నాను

సహజ రంగుల తయారీ, అద్దకంలో నిపుణులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. బెంగాల్‌లో ఉన్నారు. వాళ్లతో పని చేయడంతో అచ్చంగా పని అర్థమైంది. అడవిలో దొరికే మొక్కల గురించి వాళ్లకు తెలిసినంత సమాచారం ఏ పుస్తకంలోనూ దొరకదు. అలాగే కొన్ని రంగులు కాటన్‌ మీద సరిగ్గా పట్టుకోవు. సిల్క్, లెదర్, లియోసెల్‌ వంటి ఫ్యాబ్రిక్‌లో చేసిన నా ప్రయోగం మంచి ఫలితాలనిచ్చింది. దాంతో నా ‘ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్‌ వీగన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌’ సహజంగానే సక్సెస్‌ అయింది. ఫ్యాషన్‌ మనం నివసించే ప్లానెట్‌కి ప్రాణాంతకం కాకూడదనేది నా అభిలాష’’.



Tags:    
Advertisement

Similar News