రష్యన్స్ బ్యూటీ సీక్రెట్స్ తెలుసా?
కొత్తకొత్త బ్యూటీ ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడంలో రష్యన్లు ముందుటారు.
కొత్తకొత్త బ్యూటీ ట్రెండ్స్‌ను ఫాలో అవ్వడంలో రష్యన్లు ముందుటారు. ముఖ్యంగా రష్యన్ అమ్మాయిలు కేవలం నేచురల్ హోం రెమిడీస్ ద్వారానే అందంగా కనిపిస్తారు. మేకప్‌కు దూరంగా ఉండే రష్యన్లు అందం కోసం ఎలాంటి కేర్ తీసుకుంటారంటే..
బ్యూటీ కేర్ విషయంలో రష్యన్ల ప్రత్యేకత ఏంటంటే.. అందం కోసం వాళ్లు పార్లర్ల చుట్టూ తిరగరు. డబ్బు, సమయాన్ని వెచ్చించరు. ఇంట్లోనే సరైన బ్యూటీ రొటీన్ ఫాలో అవుతారు.
రష్యన్ అమ్మాయిలు ప్రతిరోజూ హెర్బల్ టీ తాగుతారు. దానివల్ల వాళ్ల స్కిన్ ఎప్పటికప్పుడు డీటాక్స్ అవుతుంటుంది. హెర్బల్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లుండే స్కిన్‌ను హెల్దీగా ఉంచుతాయి. పైగా రష్యా.. రకరకాల హెర్బ్స్‌కు ఫేమస్. స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్‌కు, ఫేస్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ కోసం అక్కడ ప్రత్యేకమైన హెర్బ్స్ దొరుకుతాయి.
రష్యన్ అమ్మాయిలకు స్టీమింగ్ అలవాటు ఉంటుంది. ఆవిరి పట్టడం వల్ల చర్మంపైన పేరుకున్న మురికి తొలగిపోతుంది. స్టీమింగ్ కోసం రష్యాలో బన్యాస్ అనే ప్రత్యేకమైన స్టీమింగ్ సెంటర్లు కూడా ఉంటాయి. స్టీమింగ్ అనేది వాళ్ల లైఫ్‌స్టైల్‌లో భాగం.
ఇకపోతే ఫేస్ వాష్‌లు , స్క్రబ్ లాంటివి రష్యన్లు తక్కువగా వాడతారు. ఒకవేళ వాడినా.. ఆలివ్ ఆయిల్, హెర్బ్స్ లాంటి సహజమైన వాటినే ఎంచుకుంటారు. సముద్రపు ఉప్పుని ఫేస్ స్క్రబ్ కోసం వాడతారు.
రష్యన్ అమ్మాయిలు హెయిర్ కేర్ విషయంలోనూ సింపుల్‌గానే ఉంటారు. క్రమం తప్పకుండా జుట్టుకి ఆయిల్ పెట్టడం వాళ్లకు అలవాటు. తరచుగా నూనెను తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తారు. ఈ అలవాటు వల్ల అక్కడ చాలామందికి దృఢమైన లాంగ్ హెయిర్ ఉంటుంది.
వీటితోపాటు ఫిట్‌గా ఉండడం కోసం రష్యన్లు రోజువారీ వ్యాయామాలు చేస్తారు. న్యూట్రియెంట్స్ ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు తింటారు.