అందానికి అరేబియన్ సీక్రెట్స్!

బ్యూటీ ట్రెండ్స్‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. గ్లాసీ స్కిన్, షార్ట్ హెయిర్‌‌కు కొరియన్స్‌ ఫేమస్ అయితే లాంగ్ హెయిర్, పింక్ స్కిన్‌కు అరబ్బులు ఫేమస్. అందంలో అరబ్ అమ్మాయిల స్టైలే వేరు.

Advertisement
Update:2023-09-27 18:32 IST

బ్యూటీ ట్రెండ్స్‌లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. గ్లాసీ స్కిన్, షార్ట్ హెయిర్‌‌కు కొరియన్స్‌ ఫేమస్ అయితే లాంగ్ హెయిర్, పింక్ స్కిన్‌కు అరబ్బులు ఫేమస్. అందంలో అరబ్ అమ్మాయిల స్టైలే వేరు. నిగనిగలాడే వారి చర్మసౌందర్యం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లేత గులాబి రంగు చర్మం, నిగనిగలాడే ఒత్తైన కురులు, నల్లని కళ్లు.. ఇలా అందంలో అరేబియన్ల తీరు వేరు. సహజమైన అందానికి అరేబియన్లు పెట్టింది పేరు. ఎందుకంటే ఎలాంటి మేకప్, బ్యుటీ ప్రొడక్ట్స్ జోలికి వెళ్లకుండానే వాళ్లు సహజమైన చర్మ సౌందర్యాన్ని మెయింటైన్ చేస్తారు. అదెలాగంటే..

కళ్లకు కాటుక

అరబ్ అమ్మాయిల కళ్లు ప్రత్యేకంగా కనిపించడానికి కారణం ఆ కళ్లకు ఉన్న కాటుకే. అరేబియన్లకు మొదట్నుంచీ కళ్లకు కాటుక పెట్టుకునే అలవాటు ఉంది. కాటుక వల్ల కళ్లు పొడిబారకుండా ఎప్పుడూ తేమగా, చల్లగా ఉంటాయి.

ఎండకు లాబ్నే

అరేబియన్లు ఎండకు బయటకు వెళ్లేటప్పడు ‘లాబ్నే’ అనే క్రీమ్ రాసుకుంటారు. ఇది వాళ్లకు సహజమైన సన్ స్క్రీన్ లోషన్‌లా పనిచేస్తుంది. లాబ్నే అనేది యోగర్ట్, చీజ్, వెన్నతో చేసే ఓ ప్రత్యేకమైన మిశ్రమం. ఇది ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

కురుల కోసం హెన్నా

అరబ్ అమ్మాయిల నల్లని పొడవాటి జుట్టు కోసం హెన్నా వాడతారు. అరేబియన్లు పొడవాటి జుట్టుని ఇష్టపడతారు. జుట్టుపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు.

షుగర్ హెయిర్ రిమూవల్

చేతులు, కాళ్లపై ఉండే హెయిర్ ను తొలగించడం కోసం అరబ్ అమ్మాయిలు షుగర్, లెమన్‌తో చేసే సహజమైన హెయిర్ రిమూవల్ ను వాడతారు. షుగర్, నిమ్మరసాన్ని కలిపి వేడి చేసి తయారుచేసిన మిశ్రమాన్ని వ్యాక్స్‌లా ఉపయోగిస్తారు.

రోజువారీ రోజ్ వాటర్

మృదువైన లేత చర్మం కోసం అరబ్ అమ్మాయిలు రోజ్ వాటర్ వాడతారు. అరేబియన్ల రోజువారీ బ్యూటీ రోటీన్ లో రోజ్ వాటర్ ఉండాల్సిందే. రోజ్ వాటర్‌‌ను ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్స్‌లో కలిపి యూజ్‌ చేస్తారు.

చర్మ సమస్యలకు అలొవెరా

మొటిమలు, మచ్చలు వంటివి వచ్చినప్పుడు అరేబియన్లు కెమికల్స్‌కు బదులు అలొవెరా జెల్ ఉపయోగిస్తారు. అలొవెరా వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మ సమస్యలు తగ్గుతాయి.

డైట్ ఇలా..

ఇకపోతే చర్మ సౌందర్యం కోసం అరేబియన్లు ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతారు. మాంసాహారంతో పాటు వెజ్జీస్ కూడా బ్యాలెన్స్‌డ్ గా తింటారు. రోజువారీ డైట్‌లో , పెరుగు, గుడ్డు, కీరా, ఖర్జూరం, తేనె, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వంటివి ఎక్కువగా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News