బైనాక్యులర్ వద్దన్న షర్మిల.. వైఎస్సార్టీపీ కొత్త గుర్తు ఏంటి..?

బైనాక్యులర్ గుర్తు షర్మిలకు నచ్చలేదు. అందుకే ఆ పార్టీ ఎక్కడా గుర్తు విషయంలో ప్రకటన చేయలేదు, కనీసం ఆ గుర్తుని తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా పెట్టలేదు.

Advertisement
Update:2023-11-02 07:21 IST

తెలంగాణలో వైఎస్సార్టీపీ ప్రచారంలో దూసుకెళ్లకపోవడానికి ప్రధాన అడ్డంకి ఆ పార్టీ గుర్తు. అవును, ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తు పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నచ్చలేదు. అందుకే ఆ పార్టీ ఎక్కడా గుర్తు విషయంలో ప్రకటన చేయలేదు, కనీసం ఆ గుర్తుని తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా పెట్టలేదు. గుర్తు మార్చుకోడానికి ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు.

కొత్త గుర్తు కావాలి..

వైఎస్సార్టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తు వద్దని, ఫ్రీ సింబల్స్‌‌ లో వేరే గుర్తు కేటాయించాలని షర్మిల అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈసీ కొత్త గుర్తు కేటాయించకపోతే బైనాక్యులర్ గుర్తుతోనే ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే కొత్త గుర్తు వచ్చే వరకు వేచి చూడాలనుకుంటున్నారు. గుర్తు వచ్చాక దాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకే బైనాక్యులర్ పై ఎక్కడా నాయకులు నోరు మెదపడంలేదు.

ఖమ్మంలో అద్దెకు ఇల్లు..

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 6న పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. దీనికోసం నామినేషన్ ఫాంలు, అఫిడవిట్‌‌ లు సిద్ధం చేస్తున్నారు. పాలేరులో ఆమె విసృతంగా పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తారని, ఆ తర్వాత ప్రచారం ప్రారంభిస్తారని అంటున్నారు. ఖమ్మంలో షర్మిల ఓ ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. షర్మిలతోపాటు, విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పాలేరుతోపాటు వైఎస్సార్టీపీ పోటీ చేసే మిగతా స్థానాల్లో కూడా షర్మిల ప్రచారానికి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 సభలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మొత్తమ్మీద కాంగ్రెస్ హ్యాండివ్వడంతో షర్మిల ఇలా ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తోంది. గుర్తు విషయంలో తుది నిర్ణయం వచ్చాక ఆమె పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారు. 

Tags:    
Advertisement

Similar News