పార్టీ విలీనంపై షర్మిల ఫస్ట్ రియాక్షన్..

మొత్తమ్మీద తాను తెలంగాణలోనే ఉంటాననే విషయంపై క్లారిటీ ఇచ్చిన షర్మిల, వైఎస్సార్టీపీ తరపునే తన పోరాటం ఉంటుందని మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు.

Advertisement
Update:2023-06-23 18:30 IST
పార్టీ విలీనంపై షర్మిల ఫస్ట్ రియాక్షన్..
  • whatsapp icon

వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే వార్తలపై పరోక్షంగా స్పందించారు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. పార్టీ విలీనాన్ని ఆమె ఎక్కడా ఖండించలేదు కానీ.. తెలంగాణను వదిలి తాను ఎక్కడికీ వెళ్లిపోనంటూ కుండబద్దలు కొట్టారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు.


పోరాటం సరే, అది ఏ పార్టీనుంచి..?

చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానన్నారు షర్మిల. కానీ ఏ పార్టీనుంచి ఆ పోరాటం ఉంటుందనే విషయాన్ని ఆమె చెప్పకపోవడం విశేషం. అంటే కాంగ్రెస్ లో విలీనం అనే వార్తల్ని ఆమె ఎక్కడా ఖండించకపోగా, తన ట్వీట్ తో ఆ సస్పెన్స్ ని అలాగే కొనసాగించారు.

ఊహాజనిత కథలు రాస్తూ, తనకు తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని అన్నారు షర్మిల. అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారంతా పనిలేని, పసలేని దార్శనికులంటూ మండిపడ్డారు. తన రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని, సమయాన్ని తెలంగాణపై పెట్టాలని హితవు పలికారు. "నా ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమే" అని ముక్తాయించారు షర్మిల.

మొత్తమ్మీద తాను తెలంగాణలోనే ఉంటాననే విషయంపై క్లారిటీ ఇచ్చిన షర్మిల, వైఎస్సార్టీపీ తరపునే తన పోరాటం ఉంటుందని మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. 

Tags:    
Advertisement

Similar News