సినీ ఇండస్ట్రీ సమస్య పరిష్కారానికి "సోఫా" చేరాల్సిందే...అంబటి ట్వీట్

సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు.

Advertisement
Update:2024-12-26 14:56 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ సమస్య పూర్తి పరిష్కరానికి "సోఫా" చేరాల్సిందే అని అంబటి ఎక్స్ వేదికగా తెలిపారు. పుష్ప2 మూవీ సీన్‌ను గుర్తు చేస్తూ సైటైర్లు పేల్చారు. అయితే.. దీనిపై నెటిజన్స్‌ రక రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. “సోఫా” అంటే రూ. 200 కోట్లు రేవంత్‌ రెడ్డికి చేరాయని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎంని కలిశారు. ఈ భేటీలో టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు, అల్లు అర్జున్‌ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చింది. సంధ్యా థియేటర్‌ ఘటన, అల్లు అర్జున్‌ అరెస్టు నేపథ్యంలో సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిస్తోంది. ఇక మీదట సినిమా టిక్కెట్ రెట్లు పెంచడటం, బెనిఫిట్‌ షోలు ఉండవని తేల్చి చెప్పారట ముఖ్యమంత్రి. టాలీవుడ్‌‌లో ప్రతి హీరో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారనికి సహకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్నాది.సినీ ఇండస్ట్రీలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. సినీ పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మంత్రి వర్గ ఉప సంఘం సినీ పరిశ్రమకు చెందిన పలు అంశాలపై అధ్యయనం చేయనుందని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News