గ్రూప్‌-1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

గ్రూప్‌-1 పరీక్షపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

Advertisement
Update:2024-12-26 15:21 IST

టీజీపీఎస్పీ గ్రూప్‌-1 ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రూప్‌-1 పరీక్షపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంతవరకు గ్రూప్‌-1 ఫలితాలు ప్రకటించవద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేసింది.

జీవో 29తో పాటు పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్‌-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరారు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆఖరి నిమిషంలో పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు కూడా మెయిన్స్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైకోర్టులోనే దీనిపై తేల్చుకోవాలని సూచించింది. గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించింది. గ్రూప్‌-1 అభ్యర్థులు వేసిన పిటిషన్‌ ఈ రోజు విచారణకు రాగా.. హైకోర్టు కూడా గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News