యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్‌ కొడంగల్‌కు తరలింపు..!

కేసీఆర్ ప్రభుత్వం గతేడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలు కోసం జీవోలు ఇచ్చింది. ఇందులో గద్వాల్‌, నారాయణపేట, ములుగు, నర్సంపేట(వరంగల్‌), మెదక్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్లాన్ చేసింది.

Advertisement
Update:2024-02-10 11:18 IST

సొంత నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో మెడికల్‌ కాలేజ్‌ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం యాదగిరిగుట్టకు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ క‌ళాశాల‌ను కొడంగల్‌కు తరలించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.

గతేడాది జూలై 5న కేసీఆర్ ప్రభుత్వం యాదగిరిగుట్టకు రూ.183 కోట్లతో మెడికల్ కాలేజ్‌, 100 పడకల హాస్పిటల్‌ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు యాదగిరిగుట్ట మెడికల్‌ కాలేజ్‌ను హాస్పిటల్‌తో సహా అధ్యాపకుల లేమి, వసతుల కొరత లాంటి సాకులు చూపి కొడంగల్‌కు తరలించే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న, అభివృద్ధి చెందుతున్న యాదగిరి గుట్టకు కేటాయించిన‌ మెడికల్‌ కాలేజ్‌ను తరలించడంపై స్థానికులు మండిపడుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం గతేడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలు కోసం జీవోలు ఇచ్చింది. ఇందులో గద్వాల్‌, నారాయణపేట, ములుగు, నర్సంపేట(వరంగల్‌), మెదక్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్లాన్ చేసింది. అయితే రేవంత్ సర్కార్‌ మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేసింది. దీంతో పాటు యాదగిరిగుట్టలోని మెడికల్ కాలేజీని కొడంగల్‌కు తరలించాలని ప్లాన్ చేసింది. ఇక గద్వాల్‌, నారాయణపేట, ములుగు, నర్సంపేట(వరంగల్‌), మెదక్‌లో మాత్రమే మెడికల్ కాలేజీల ఏర్పాటు సాధ్యమని తేల్చింది.

Tags:    
Advertisement

Similar News