క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా..

నాకౌట్ దశలో రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆస్ట్రేలియా.. చివరకు కప్ సాధించింది. ఏకంగా ఆరోసారి వరల్డ్ కప్ గెలుచుకుని వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.

Advertisement
Update:2023-11-19 21:47 IST

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఆరోసారి నెగ్గింది. ఫైనల్ లో భారత్ పై తిరుగులేని విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, భారత్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. దాదాపుగా బ్యాట్స్ మెన్ అందరూ నిరాశపరిచారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 66, విరాట్ కోహ్లీ 54 పరుగులతో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 241 పరుగుల సులువైన లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది.


241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్‌ ఛాంపియన్ గా నిలిచింది. ఓ దశలో మూడు వికెట్లు కోల్పోయి కాస్త కంగారులో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకి ట్రావిస్ హెడ్ బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా విజయంలో హెడ్‌ దే కీలక పాత్ర. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్‌ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. విన్నింగ్ షాట్ కి ప్రయత్నించి చివర్లో హెడ్ అవుటయ్యాడు.

నాకౌట్ దశలో రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆస్ట్రేలియా.. చివరకు కప్ సాధించింది. ఏకంగా ఆరోసారి వరల్డ్ కప్ గెలుచుకుని వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. మిగతా జట్లకు అసాధ్యమయ్యే టార్గెట్ ని ఫిక్స్ చేసింది. నాకౌట్ దశనుంచి వరుస విజయాలతో ఉన్న ఇండియా టీమ్.. చివర్లో చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్ తో తక్కువ స్కోర్ కే ఆలౌట్ కావడంతోపాటు, బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలతో ఆస్ట్రేలియాకు కప్పు అప్పగించింది. 

Tags:    
Advertisement

Similar News