రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడంటే?
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హైదరాబాద్‌లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Advertisement
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్‌లో రిపబ్లిక్ డే వేడుకులు, రాజ్ భవన్ ఎట్ హోం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7.30గంటల నుంచి 11.30 గంటల వరకు సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్ భవన్ సమీపంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్, పరేడ్ గ్రౌండ్ మార్గంలో వచ్చే వాహనాదారులు ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Advertisement