గోద్రా రైలు ఘటనపై సుప్రీంలో విచారణ ఎప్పుడంటే?

గోద్రా రైలు ఘటన కేసుపై ఫిబ్రవరి 13వ తేదీన తుది విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొన్నాది

Advertisement
Update:2025-01-16 17:31 IST

గోద్రా రైలు ఘటన కేసుపై ఫిబ్రవరి 13వ తేదీన తుది విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. గుజరాత్ ప్రభుత్వంతో పాటు అనేక మంది దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నది. ఈ కేసు విచార‌ణ‌కు మ‌రో తేదీని ఇవ్వ‌బోమ‌న‌ని జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి, అర‌వింద్ కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తెలిపింది.

2002, ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన స‌బ‌ర్మ‌తి రైలుకు చెందిన ఎస్-6 బోగీలో చెల‌రేగిన మంట‌ల్లో సుమారు 59 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. ఆ కేసులో 2017లో గుజ‌రాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ అనేక మంది సుప్రీంలో అప్పీల్ చేసుకున్నారు. జీవిత ఖైదు శిక్ష ప‌డిన 11 మంది నిందితుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని కోరుతూ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గుజ‌రాత్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్ర‌యించింది.

Tags:    
Advertisement

Similar News