దేశవ్యాప్తంగా ఒకేసారి ఓఎంఆర్ పద్ధతిలో నీట్
పేపర్ లీకేజీలు, మాస్ కాపీయింగ్ నేపథ్యంలో ఎన్‌టీఏ నిర్ణయం
Advertisement
దేశవ్యాప్తంగా ఒకేసారి ఓఎంఆర్ పద్ధతిలో నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన చేసింది. నీట్ యూజీ -2024 పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీల నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల్లో అలాంటి అవకతవకలకు చాన్స్ ఇవ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకే ఓఎంఆర్ షీట్ మెథడ్ లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ చెప్తోంది.
Advertisement