తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..
ఈ టైమ్‌లో పంచాయతీ ఎన్నికలకు వెళ్తే నెలరోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. పరిపాలన కార్యక్రమాలు ముందుకు సాగవు. 6 గ్యారంటీల అమలు ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 31తో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుంది. అప్పటికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలి. ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కూడా రెడీగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాసెస్ మొదలు పెట్టింది. ఎన్నికల నిర్వహణకు వివరాలు పంపాలని ప్రభుత్వానికి, కలెక్టర్లకు లెటర్ రాసింది. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదని పంచాయతీరాజ్, ఈసీ అధికారులు చెబుతున్నారు.
ఈ టైమ్‌లో పంచాయతీ ఎన్నికలకు వెళ్తే నెలరోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. పరిపాలన కార్యక్రమాలు ముందుకు సాగవు. 6 గ్యారంటీల అమలు ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారపార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈసారి తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే లోక్‌సభ ఎన్నికల్లోపు 6 గ్యారంటీలు అమలు చేయాలని భావిస్తోంది. 6 గ్యారంటీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్తే లాభం జరుగుతుందనే ప్లాన్‌లో ఉంది రేవంత్ సర్కారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే అదే ఊపులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి సత్తా చాటాలని చూస్తోంది.
మరోవైపు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీగా బిల్లులు పెండింగ్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1200కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ఒక్కో సర్పంచ్‌కు రూ. 5లక్షల నుంచి రూ.15లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీ కార్మికులకు రెండుమూడు నెలలకోసారి జీతాలిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఐదేండ్ల టర్మ్‌లో రెండేళ్లు కరోనాకే పోయిందని సర్పంచులు చెబుతున్నారు. బాధ్యతలు చేపట్టాక 8నెలలు జాయింట్ చెక్‌పవర్ వివాదంతో పనులు ముందుకు సాగలేదంటున్నారు.