తెలంగాణలో రూ.3,500 కోట్లు పెట్టుబడులకు ఒప్పందం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృంందం సింగపూర్ పర్యటన రెండో రోజు విజయవంతమైంది.

Advertisement
Update:2025-01-18 19:35 IST

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రూ.3,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ముచ్ఛర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ లోని STT గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ను ఇవాళ సందర్శించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ డేటా సెంటర్ హబ్‌గా మారుతోందన్నారు. ఎస్‌టీటీ డేటా సెంటర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా సీఎం సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, STT గ్రూపు సీఈవో బ్రూనో లోపెజ్ ఈ ఒప్పందం పై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ ని ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. 

Tags:    
Advertisement

Similar News