రుణమాఫీ అయ్యేవరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం

దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు అల్టిమేటం

Advertisement
Update:2024-09-27 14:52 IST

రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌ రావు డెడ్ లైన్ విధించారు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు రైతు ధర్నా వేదికగా గర్జన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాలేందో నీళ్లేందో తేలాలంటే టైం పడుతుందని చెప్పినం. కరోనా లాక్‌డౌన్‌లోనూ కేసీఆర్‌ రైతులను కడుపులో పెట్టుకున్నరు. కేసీఆర్‌ రైతులకు 24 గంటల కరెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు రావడం లేదని రైతాంగం ప్రశ్నిస్తున్నది. నంగునూరులో యాసంగికి కాళేశ్వరం నీళ్లు వచ్చాయి. కాళేశ్వరం కూలిపోతే నీళ్లు ఎట్లా వచ్చినయ్‌ ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వచ్చినంక భూములు కొనేటోడే లేడు. రైతులు 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు.

ఎన్నికలకు ముందు అన్నిరకాల వరికి బోనస్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు సన్నాలకే బోనస్‌ ఇస్తామని సీఎం రేవంత్‌ అంటున్నారు అని హరీశ్‌ ధ్వజమెత్తారు. రుణమాఫీ అయ్యేవరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం. భూమి అమ్ముకున్న రైతుల రుణమాఫీ చేయడం లేదు. ఆరు గ్యారెంటీలనని రేవంత్‌రెడ్డి బాండ్‌ పేపర్లు పంపారు. రేషన్‌ కార్డుతో సంబంధం లేన్పుడు మాఫీ ఎందుకు చేయడం లేదు? అని నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News