ఎగ్జిట్ పోల్స్ తప్పు అని ప్రూవ్ చేస్తాం..
నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ తప్పు అని చెప్పారు కేటీఆర్. నేషనల్ మీడియా సరిగ్గా సర్వే చేయదని, 200 శాంపిల్స్ తీసుకుని అదే తమ రిపోర్ట్ అని చెబుతుందని, ఆ ఎగ్జిట్ పోల్స్ ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చూసి ప్రజలు కంగారు పడొద్దని చెప్పారు మంత్రి కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని ప్రూవ్ చేయడం బీఆర్ఎస్ కి కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ చాలా చూశామని చెప్పారు. డిసెంబర్ 3న తామే తిరిగొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.70 కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ కి వస్తాయని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని అన్నారు.
నేషనల్ మీడియాపై ధ్వజం..
నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ తప్పు అని చెప్పారు కేటీఆర్. నేషనల్ మీడియా సరిగ్గా సర్వే చేయదని, 200 శాంపిల్స్ తీసుకుని అదే తమ రిపోర్ట్ అని చెబుతుందని, ఆ ఎగ్జిట్ పోల్స్ ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. 2018లో కూడా ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ చూశామని, వీటిని ఎవరూ నమ్మొద్దని, కన్ఫ్యూజ్ కావొద్దని.. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు కేటీఆర్.
పోలింగ్ పర్సంటేజ్ ని కూడా ఇప్పుడే పరిగణలోకి తీసుకోలేమని, రేపు ఉదయం కరెక్ట్ నెంబర్స్ వస్తాయని అప్పుడు మాట్లాడదామని చెప్పారు కేటీఆర్. డిసెంబర్ 3న తాను మళ్లీ మాట్లాడతానని, మీరడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతానని మీడియా ప్రతినిధులకు బదులిచ్చారు. కేవలం హైదరాబాద్ లోనే కాదని, ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ అర్బన్ ఓటర్లు బయటకు రాలేదని చెప్పారు కేటీఆర్.
♦