మంత్రి పదవిపై వివేక్ కీలక వ్యాఖ్యలు..సీఎం రేవంత్ హామీ ఇచ్చాడు
తెలంగాణలో మంత్రి పదవిపై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాక ఫ్యామిలీలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
రాష్ట్రంలో మంత్రి పదవిపై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాక ఫ్యామిలీలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. మరో వైపు కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను రాష్ట్ర అధినాయకత్వం హైకమాండ్‌కు పంపింది. తనకు మాలల అభివృద్ధి, హక్కులు ముఖ్యమని మంత్రి పదవి కాదన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న భారీ బహిరంగ సభకు మాలలు అందరూ హాజరుకావాలి.. మాలల ఐక్యతను చాటాలని గడ్డం వివేక్ పిలుపునిచ్చారు. ఎస్సీల ఐక్యత కోసం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్ర ఇవాల్టికి కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చేరింది. పాదయాత్రలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. దళితుల్లో ఉపకులాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు వారందరికీ న్యాయం చేయాలి. ప్రైవేటు జాబ్ల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.