మహాకుంభమేళాకు సీఎం రేవంత్‌కి యూపీ ప్రభుత్వం ఇన్విటేషన్

సీఎం రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు ఆహ్వానించారు.

Advertisement
Update:2024-12-06 18:04 IST

ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అలహాబాద్‌లో మహాకుంభమేళా జరగనుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం మంచిదని భక్తులు భావిస్తారు. ఈ నేపధ్యంలో యూపీ ఉప ముఖ్యమంత్రి... ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి ఈ మహాకుంభమేళాకు ఆహ్వానించారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి పన్నెండేళ్లకోసారి మాఘమాసంలోని అమావాస్య రోజున బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా జరుపుకుంటారు. జనవరి 2025 నెలలో మహా కుంభమేళా నిర్వహించనున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా ఈసారి ప్రయాగ్‌రాజ్ తీర్థంలో నిర్వహించనున్నారు. కుంభమేళా జాతరకు కోట్లాది మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. త్రివేణీసంగమం ప్రయాగ్‌రాజ్ నగరంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News