బ‌తుక‌మ్మ‌కు బ‌స్సులో ఊరెళితే బ‌హుమ‌తులు.. టీఎస్ఆర్టీసీ ప్ర‌క‌ట‌న‌

ఈ నెల 21, 22, 23, 28, 29, 30 తేదీల్లో ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేవారికి ల‌క్కీడ్రాలో న‌గ‌దు బ‌హుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్లు ఆర్టీసీ ప్ర‌క‌టించింది.

Advertisement
Update:2023-10-11 10:37 IST

ద‌స‌రా పండ‌గకు బ‌స్సులుండ‌వు.. ఉన్నా డొక్కు బ‌స్సులేసి, ఎక్స్‌ట్రా ఛార్జీలు గుంజుతారు అని జనం చిరాకుప‌డేవారు. ఆ ప‌రిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పండ‌గ‌ల వేళ ప్ర‌యాణికుల‌కు కావ‌ల్సిన‌న్ని బ‌స్సులు అందుబాటులో ఉంచి ప్ర‌యాణికుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని టీఎస్ఆర్టీసీ నిర్ణ‌యించింది. అంతేకాదు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌యాణం చేసేవారికి ల‌క్కీడ్రాలో బ‌హుమతులు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

అటు 3.. ఇటు 3 రోజులు

బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండ‌గ‌ల‌ను పుర‌స్క‌రించుకుని 5,265 ప్ర‌త్యేక బ‌స్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటిలోనూ రెగ్యుల‌ర్ టికెట్ ధ‌రే ఉంటుంది. ఈ నెల 21, 22, 23, 28, 29, 30 తేదీల్లో ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించేవారికి ల‌క్కీడ్రాలో న‌గ‌దు బ‌హుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్లు ఆర్టీసీ ప్ర‌క‌టించింది. అంటే పండ‌గ‌కు వెళ్లి, వ‌చ్చేవారికి కూడా ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌న్న‌మాట‌.

110 మందికి 10.89 లక్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తులు

రీజియ‌న్‌కు 10 మంది చొప్పున ( ఐదుగ‌రు పురుషులు, ఐదుగురు స్త్రీల‌ను) ల‌క్కీడ్రాలో ఎంపిక చేస్తారు. వారికి ఒక్కొక్క‌రికి రూ.9,900 చొప్పున ఇస్తారు. ఇలా మొత్తం 110 మంది ప్ర‌యాణికుల‌కు రూ.10.89 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తులు ఇస్తామని టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది.

టికెట్ డ్రాప్ బాక్స్‌లో వేయాలి

ప్ర‌యాణం పూర్త‌య్యాక మీ టికెట్ మీద పూర్తి పేరు, ఫోన్ నంబ‌ర్ రాసి బ‌స్టాండ్‌లో ఉన్న డ్రాప్ బాక్స్ లో వేయాలి. ల‌క్కీడ్రా వివ‌రాల‌ను 040-69440000, 23450003 నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి క‌నుక్కోవ‌చ్చు.

Tags:    
Advertisement

Similar News