ఏపీ కూటమిలో కుంపటి...లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్
టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేశ్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు
టీటీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేశ్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ 'యువగళం'తోనే సమాధానం చెప్పారన్నారు. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. 'ఎవరి పార్టీల కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి. నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్‌ను సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. 'ఉప ముఖ్యమంత్రి పదవికి లోకేశ్ వంద శాతం అర్హులు.
రాజకీయంగా లోకేశ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. యువగళం పాదయాత్రతో నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. లోకేశ్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది? ఓడిపోయి, భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం..సీఎం అంటున్నారని వర్మ అన్నారు . డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటని ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు.