పారిశుద్ద్య వాహనాలను ప్రారంభించి స్వయంగా నడిపిన పవన్

ప్రతి ఇంటి నుంచీ చెత్త రహిత సమాజం ఆలోచన రావాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Advertisement
Update:2025-01-18 16:34 IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో 'స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ద్య తరలింపు వాహనాలను జెండా ఊపి డిప్యూటీ సీఎం ప్రారంభించారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించి స్వయంగా నడిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.

ప్రతి నెల మూడో శనివారం స్వచ్చంద కార్యక్రమం నిర్వహించాలని మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామాల వివరాలు, సంపద సృష్టి కేంద్రాల సహకారంతో పండించిన పళ్లు, కూరగాయల ప్రదర్శనను తిలకించారు. ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న మూడు రకాల బుట్టలను అధికారులు పవన్ కళ్యాణ్ కు చూపారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు విష పూరిత వ్యర్ధాలను వేరు చేసేందుకు ఇంటికి మూడు చెత్త బుట్టలు ఇస్తున్నట్టు వారు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News