తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం
తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Advertisement
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 7వ మైలు వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఇక ఈ సంఘటనలో నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.దీంతో అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తిరుమల ఘాట్ రోడ్డులో దట్టమైన పొగమంచు ఆవరించి ఉండటంతో భక్తులు ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది.
మరోవైపు తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు వెంకన్నకు రూ.6 కోట్ల భూరి విరాళం ఇచ్చారు. ఇవాళ ఉదయం కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చిన వర్ధమాన్ జైన్.. రూ.6 కోట్లకు సంబంధించిన డీడీలను తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇందులో రూ.5 కోట్లు ఎస్‌వీబీసీ కోసం ఇవ్వగా.. రూ.కోటి గోసంరక్షణ ట్రస్టుకు విరాళంగా అందజేశారు
Advertisement