లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని బాబుకు విజ్ఞప్తి

వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌ రెడ్డి విజ్ఞప్తి

Advertisement
Update:2025-01-18 13:53 IST

వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని సీఎంప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుకు సభా వేదిక నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ..

గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే గేమ్‌ఛేందర్‌ తయారవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బనకచర్లకు నీళ్లు తీసుకురావడం నా జీవితాశయం. సీమ ప్రజల రుణం తీర్చుకోవాలన్నదే నా ఆలోచన. ఈ నెలఖారులోనే వాట్సప్‌ గవర్నెన్స్‌ తీసుకొస్తున్నా. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్‌ పెడితే చాలు. మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పనిలేదు. మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెలిపారు. అనుక్షణం తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్‌ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగు వారి ఆత్మగౌరవం అన్నారు. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు.\ అంతకుముందు కడప విమానాశ్రయంలో జిల్లా నేతలు, అధికారులు చంద్రబాబకు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్‌లో ఆయన మైదుకూరు చేరుకున్నారు.

Tags:    
Advertisement

Similar News