ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం
ఎన్టీఆర్ ఆశించిన సమ సమాజాన్ని సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది.. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది.. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడికి స్మృతికి నివాళులర్పిద్దాం అని చంద్రబాబు 'ఎక్స్'లో పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో.. అధికారం అంటే పేదల జీవితాలను మార్చడానికి వచ్చిన అవకాశం అని నిరూపించిన మహనీయులు. ఎన్టీఆర్ ఆశించిన సమ సమాజాన్ని సాధించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని.. తెలుగు జాతిని నంబర్ వన్ చేయడనికి కంకణబద్దులై ఉన్నామని తెలిపారు.
ఎన్టీఆర్ ఒక పేరు కాదు. ప్రభంజనం
ఎన్టీఆర్ ఒక పేరు కాదు. ప్రభంజనం.. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాచారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వారు గర్వంచే విధంగా పని చేసిన ఎన్టీఆర్, తెలుగు ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలు తెచ్చారు. ఆయన స్పూర్తితో కోటిమంది టీడీపీ సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణం అన్నారు. ఏ ఆశయాలతో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారో, వాటి కోసం మేమందరం నిరంతరం పని చేస్తాం, తెలుగుజాతిని అగ్ర స్థానంలో ఉండేలా చేస్తామని నారా లోకేష్ అన్నారు.