33 జిల్లాలు అవసరం లేదు.. రేవంత్ సంచలనం..!

ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement
Update:2024-01-06 22:18 IST

తెలంగాణలో జిల్లాల సంఖ్య విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఓ మీడియా ఛానల్ నిర్వహించిన బిగ్ డిబెట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై ఆలోచిస్తున్నామని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గిస్తారనే చర్చ మొదలైంది.

గత ప్రభుత్వం జిల్లాలు, మండలాల ఏర్పాటు విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాత జిల్లాలను హేతుబద్దీకరిస్తామన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 10 జిల్లాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే పాలన సౌలభ్యం కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వం 2016లో మరో 21 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. అయితే 2019లో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి పెరిగింది. విస్తీర్ణంలో భద్రాద్రి జిల్లా అతిపెద్దది కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా అతి చిన్నది.

Tags:    
Advertisement

Similar News