మహిళలను కించపరిచే ఉద్దేశం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

కేటీఆర్ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, అందులో ఆయన మహిళల పట్ల చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో కేటీఆర్ తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు.

Advertisement
Update:2024-08-16 10:50 IST

ఫ్రీ బస్‌ స్కీమ్‌ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ట్వీట్ చేసిన కేటీఆర్.. పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. అక్కా చెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదన్నారు.


ఇంతకీ ఏం జరిగింది?

ఫ్రీ బస్సు స్కీమ్‌లో భాగంగా మహిళలు.. ప్రయాణాల్లో ఉల్లిపాయలు పొట్టు తీయడం, కుట్లు అల్లికలు చేసుకోవడాన్ని సమర్థిస్తూ మంత్రి సీతక్క చేసిన కామెంట్స్‌పై సెటైర్లు నడుస్తున్న నేపథ్యంలో వాటిపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు గురువారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌ బస్సుల్లో మహిళలు ఎలాంటి పనులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదంటూనే డిస్కో డ్యాన్సులు చేసినా, రికార్డింగ్ డ్యాన్సులు చేసినా తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం, సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ మహిళలను అవమానించార‌ని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చాయి.

ఇక అటు మహిళా కమిషన్ సైతం కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ట్వీట్ చేశారు. కేటీఆర్ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, అందులో ఆయన మహిళల పట్ల చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో కేటీఆర్ తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News