విద్యార్థుల కలలను నిజం చేయడమే తమ లక్ష్యం : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్ఫంజలి ఘటించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థుల కలలను నిజం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. జవహర్‌లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానే కాదు.. దేశాన్ని ప్రపంచం ముందు గొప్పగా చూపించిన నేత. నవీన భారత రూపశిల్పి నెహ్రూ. రూ.5వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామని సీఎం తెలిపారు.
ఇటీవలే హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. రాష్ట్రంలో గత పదేళ్లలో 5వేల పాఠశాలలు మూతపడ్డాయి. బడ్జెట్‌లో 7 శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించాం. ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని పదోన్నతులు ఇచ్చాం, బదిలీలు చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. టీచర్ పోస్టుల భర్తీ ద్వారా విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించాం’’ అని సీఎం తెలిపారు. అన్నీ వర్సిటీలకు వీసీలను నియమించాం. పాఠశాల తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామన్నారు. కులగణన పై ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం అన్నారు