సభ వేదికపై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి..బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం

మంత్రి కొండా సురేఖ సభలో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement
Update:2025-01-18 14:51 IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం వడియారం గ్రామంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్న సభలో గందరగోళం నెలకొంది. ఓడిపోయిన అభ్యర్థిని సభ వేదిక పైకి పిలిచిన ప్రభుత్వ అధికారులు.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో చేగుంట మండలం వడియారం గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గోన్నారు. దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించడం పట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ హోదాతో శ్రీనివాస్ రెడ్డిని వేదికపై కూర్చోబెడుతారని మంత్రి కొండా సురేఖను ప్రశ్నించాడు. మంత్రి సూచనతో శ్రీనివాస్ రెడ్డి వేదికపై వెనక వరుసలో కూర్చున్నారు.

చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ప్రోటోకాల్ పాటించాలని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభా ప్రాంగణంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో మారుమోగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి, తోపులాటకు దిగారు. వారి మధ్య గొడవ కారణంగా సభా కార్యక్రమం రసభాసగా మారిపోయింది. మంత్రి కొండా సురేఖ సర్ధిచెప్పే ప్రయత్నం చేసినప్పటికి రెండు వర్గాలు గొడవ ఆపలేదు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో దౌర్జన్యానికి ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Tags:    
Advertisement

Similar News