అధికారులపై దాడి వెనుకున్న కుట్రదారులను శిక్షించాలి

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి

Advertisement
Update:2024-11-14 17:41 IST

వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటన వెనుకున్న కుట్రదారులను శిక్షించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌ డిమాండ్‌ చేశారు. అధికారులపై దాడిని నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడటం సరికాదన్నారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. దాడిలో గాయపడిన అధికారిని పరామర్శించకపోగా దాడిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దాడి చేసిన వాళ్లను కాకుండా దాడికి పాల్పడిన వాళ్లను పరామర్శించడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో జేఏసీ నాయ‌కులు రామ‌కృష్ణ‌, రాములు, నిర్మ‌ల‌, ద‌ర్శ‌న్‌గౌడ్, కత్తి జనార్దన్, దేవిక, శ్రీరాం, హరికిషన్, గోపాల్, విజయారావు, సుగంధిని, హేమలత, రాబర్ట్ బ్రూస్, రోహిత్ నాయక్, మల్లేష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News