కొత్వాల్ ఆఫీస్‌కు పూర్వ శోభ.. పునరుద్ధ‌రణ పనులు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం

1920 నుంచి 2002 వరకు కొత్వాల్ బిల్డింగ్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌గా సేవలు అందించింది. 2002లో సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌కు తరలించారు.

Advertisement
Update:2023-05-10 11:25 IST

నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ పోలీస్ హెడ్‌‌ను కొత్వాల్‌గా పిలిచేవారు. అప్పట్లో పురానీ హవేలీ ప్రాంతంలో కొత్వాల్ కోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. 176 ఏళ్ల హైదరాబాద్ పోలీసుల చరిత్రకు కొత్వాల్ కార్యాలయం ఒక గుర్తుగా చెబుతుంటారు. కాగా, దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నది. దీంతో వారసత్వ కట్టడాన్ని పరిరక్షించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పునరుద్ధ‌రణ పనులను సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

1920 నుంచి 2002 వరకు కొత్వాల్ బిల్డింగ్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌గా సేవలు అందించింది. 2002లో సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌కు తరలించారు. అప్పటి నుంచి పాత కొత్వాల్ బిల్డింగ్‌ను క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్నారు. అప్పుడప్పుడు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బిల్డింగ్ చాలా వరకు శిథిలమయ్యింది. దీంతో పునరుద్ధ‌రణ పనులు చేపట్టారు.

ఒక హైదరాబాదీగా ఈ బిల్డింగ్‌తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్స్‌ను కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పారు. గ్రీన్‌కో గ్రూప్ ఈ బిల్డింగ్ రిస్టోరేషన్ పనులకు సహకరించడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వ సహకారంతో గ్రీన్‌కో సంస్థ స్పాన్సర్‌గా పనులు ప్రారంభించామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. బిల్డింగ్ రూపురేఖలు పూర్తిగా మార్చకుండా.. పటిష్టం చేయనున్నారు.

ఇలాంటి వారసత్వ కట్టడాలను ఎన్నింటినో పునరుద్దరించిన డక్కన్ టెర్రైన్ సంస్థ ఈ రిస్టోరేషన్ పనులు చేపడుతుందని సీపీ ఆనంద్ తెలిపారు. లైమ్, హైడ్రేట్ లైమ్, రా గమ్, ఫైబర్, ఇతర మెటీరియల్‌ ఉపయోగించి బిల్డింగ్ పునరుద్దరించనున్నారు. 


Tags:    
Advertisement

Similar News