తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. నేటి నుంచి 21 రోజుల సంబరాలు
దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు ముస్తాబయ్యాయి. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
అమరుల త్యాగాలతో.. మూడున్నర కోట్ల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈ రోజు పదో ఏడాదిలోకి అడుగు పెట్టింది. తొమ్మిదేళ్లలోనే లక్ష్యాలకు మించిన ప్రగతితో రాష్ట్రం దూసుకొని పోతున్నది. వ్యవసాయం, విద్యుత్, తాగు నీరు, సాగు నీరు, పల్లెలు, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఐటీ, పరిశ్రమలు.. ఇలా ప్రతీ రంగంలో విజయాలను అందుకున్నది. వీటిని దశదశలా చాటేందుకు ఈ రోజు నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ ఉదయం 10.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి.. దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఇప్పటికే దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు ముస్తాబయ్యాయి. ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కొత్తగా ప్రారంభించుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లైట్లతో కొత్త శోభను సంతరించుకున్నది. సచివాలయంలో ప్రారంభ వేడుకల ఏర్పాట్ల కోసం శాఖలవారీగా 13,398 అధికారులను నియమించడంతోపాటు అన్ని శాఖల నుంచి 7,250 మందిని వేడుకలకు ఆహ్వానించారు. వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు.
ఏ రోజు ఏ ఉత్సవం..
జూన్ 2 - దశాబ్ది ఉత్సవాల ప్రారంభం
జూన్ 3- రైతు దినోత్సవం
జూన్ 4 - పోలీసు శాఖ సురక్షా దినోత్సవం
జూన్ 5 - విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు
జూన్ 6 - పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్ ఐటీ కారిడార్లలో సభలు
జూన్ 7 - సాగునీటి దినోత్సవం
జూన్ 8 - చెరువుల పండుగ
జూన్ 9 - సంక్షేమ సంబురాలు
జూన్ 10 - తెలంగాణ సుపరిపాలన దినోత్సవం
జూన్ 11 - సాహిత్య దినోత్సవం
జూన్ 12 - తెలంగాణ రన్
జూన్ 13 - మహిళా దినోత్సవం
జూన్ 14 - వైద్యారోగ్య దినోత్సవం
జూన్ 15 - పల్లెప్రగతి దినోత్సవం
జూన్ 16 - పట్టణ ప్రగతి దినోత్సవం
జూన్ 17 - గిరిజన దినోత్సవం
జూన్ 18 - మంచినీళ్ల పండుగ
జూన్ 19 - హరితోత్సవం
జూన్ 20 - విద్యా దినోత్సవం
జూన్ 21 - ఆధ్యాత్మిక దినోత్సవం
జూన్ 22 - అమరులకు నివాళి.. స్మారక చిహ్నం ప్రారంభం
జిల్లాల వారీగా ఇంచార్జులు వీరే..
అదిలాబాద్ - గంప గోవర్ధన్ (ప్రభుత్వ విప్)
భద్రాద్రి కొత్తగూడెం - రేగ కాంతారావు (ప్రభుత్వ విప్)
జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్
జయశంకర్ భూపాలపల్లి - పల్లా రాజేశ్వర్ రెడ్డి (రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ)
జనగామ - మంత్రి ఎర్రబెల్లి దాయాకర్ రావు
జోగులాంబ గద్వాల - డిప్యుటీ స్పీకర్ పద్మారావు
కామారెడ్డి - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
కరీంనగర్ - మంత్రి గంగుల కమలాకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ - అరెకెపూడి గాంధీ (ప్రభుత్వ విప్)
మహబూబ్‌నగర్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబాబాద్ - మంత్రి సత్యవతి రాథోడ్
మంచిర్యాల - బాల్కసుమన్ (ప్రభుత్వ విప్)
మెదక్ - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మేడ్చెల్ మల్కాజిగిరి - మంత్రి చామకూరి మల్లారెడ్డి
ములుగు - ప్రభాకర్ రావు (ప్రభుత్వ విప్)
నాగర్ కర్నూల్ - గువ్వల బాలరాజు (ప్రభుత్వ విప్)
నల్గొండ - శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నారాయణపేట - సునీతా లక్ష్మారెడ్డి (రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్)
నిర్మల్ - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిజామాబాద్ - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
పెద్దపల్లి - బీ వినోద్ కుమార్ (ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు)
రాజన్న సిరిసిల్ల - మంత్రి కేటీఆర్
రంగారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సంగారెడ్డి - మంత్రి మహమూద్ అలీ
సిద్దిపేట - మంత్రి హరీశ్ రావు
సూర్యాపేట - మంత్రి జగదీశ్ రెడ్డి
వనపర్తి - మంత్రి నిరంజన్ రెడ్డి
వికారాబాద్ - రాజీవ్ శర్మ (ప్రభుత్వ ప్రధాన సలహాదారు)
వరంగల్ - శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాశ్
హన్మకొండ - దాస్యం వినయ్ భాస్కర్ (ప్రభుత్వ విప్)
యాదాద్రి భువనగరి - గొంగడి సునీత (ప్రభుత్వ విప్)