ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు!
ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికలు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అది జరగాలంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.
ఎన్నికల కోడ్ నేడో రేపో వచ్చేస్తుందన్న ఊహాగానాలు బాగా పెరిగాయి. 2019 జూన్ 17న కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఐదేళ్లవుతున్న నేపథ్యంలో జూన్ లోగానే ఎన్నికలు పూర్తయి మళ్లీ నూతన ప్రభుత్వం ఏర్పడాలి. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీలపై వస్తున్న ఊహాగానాలకు క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బూత్ అధ్యక్షులు, నాయకులతో కిషన్‌రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నందున పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఎనలేనిదని చెప్పారు.
వచ్చేవారమే ఎన్నికల కోడ్!
ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికలు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అది జరగాలంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. కిషన్‌రెడ్డి లెక్క ప్రకారం వచ్చే ఓ వారం రోజుల్లోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.