నేడు బీజేపీ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌.. ఛాన్స్‌ వీరికే..!

Telangana BJP Candidates 2023: నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొననున్నారు.

Advertisement
Update:2023-10-19 07:45 IST

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా నేడు ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉంది. జాబితాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్‌ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 60-70 స్థానాల్లో అభ్యర్థులపై ఓ అంచనా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏకాభిప్రాయం కుదిరిన 30-40 స్థానాల్లో మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు.

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొననున్నారు. ఇప్పటికే వీరంతా ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రకాష్‌ జవడేకర్‌తో సమావేశమైన నేతలు.. అభ్యర్థుల అంశంపై చర్చించారు.

మొదటి లిస్ట్‌లో సీట్లు ఖరారైన వారు- అంచనా మాత్రమే..!

1.గద్వాల్ – డీకే అరుణ

2.కరీంనగర్ – బండి సంజయ్

3.అంబర్ పేట – కిషన్ రెడ్డి

4.ముషీరాబాద్ – బండారు విజయలక్ష్మి

5.ఆర్మూర్/ కోరుట్ల – ధర్మపురి అరవింద్

6.బోథ్ – సోయం బాపూరావు

7.దుబ్బాక – మాధవనేని రఘునందన్ రావు

8.హుజూరాబాద్ – ఈటల రాజేందర్

9.మహబూబ్ నగర్ – జితేందర్ రెడ్డి

10.కల్వకుర్తి – తల్లోజు ఆచారి

11.నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి

12.ముధోల్ – రామారావు పటేల్

13.ఖానాపూర్ – రాథోడ్ రమేష్

14.ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి

15.మల్కాజ్ గిరి – ఎన్.రామచంద్ర రావు

16.ఉప్పల్ – NVSS ప్రభాకర్

17.తాండూర్ – కొండా విశ్వేశ్వర రెడ్డి

18.మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

19.వేములవాడ- తుల ఉమ

20.కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

21.ధర్మపురి – వివేక్ వెంకటస్వామి

22.ఇబ్రహీంపట్నం – బూర నర్సయ్య గౌడ్

23.పఠాన్ చెరువు – నందీశ్వర్ గౌడ్

24.భువనగిరి – గూడూరు నారాయణ రెడ్డి

25.గోషామహల్ – విక్రమ్ గౌడ్

26.మక్తల్ – జలంధర్ రెడ్డి

27.భూపాలపల్లి – చందుపట్ల కీర్తి రెడ్డి

28.కాగాజ్ నగర్ – పాల్వాయి హరీష్

29.రాజేంద్ర నగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి

30.మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్

31.సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి

32.కామారెడ్డి – విజయశాంతి

33.నారాయణపేట – రతంగ్ పాండు రెడ్డి

34.అందోల్ – బాబు మోహన్

35.మానకొండూర్ – ఆరేపల్లి మోహన్

36.సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వర రావు

Tags:    
Advertisement

Similar News