సర్వే...ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆరెస్ దే విజయం ...కేటీఆర్, హరీష్ లకు 65 శాతంపై గా ఓట్లు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత వివిధ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించాయి. దాదాపు మెజార్టీ సర్వేలు, 119 సీట్ల అసెంబ్లీలో టీఆరెస్ 100 సీట్లకు పైగా గెలుస్తుందని తేల్చాయి.
2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) అఖండ విజయం సాధిస్తుందని ఐదు సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన పలు సర్వేలు తేల్చి చెప్పాయి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత వివిధ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించాయి. దాదాపు మెజార్టీ సర్వేలు, 119 సీట్ల అసెంబ్లీలో టీఆరెస్ 100 సీట్లకు పైగా గెలుస్తుందని తేల్చాయి. వీటిలో 94 స్థానాల్లో టీఆరెస్ 35 శాతం పైగా ఓట్లు సాధిస్తుందని, కనీసం 40 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు 50 శాతానికి పైగా ఓట్లను పొందుతారని, 16 స్థానాల్లో ఆ పార్టీకి 30 శాతం, అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తాయని సర్వేలు తేల్చాయి.
ఏఐఎంఐఎం కూడా ఏడు స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు తెలిపాయి. టీఆర్‌ఎస్ మరోసారి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి అధికారాన్ని సునాయాసంగా నిలబెట్టుకుంటుందని వివిధ సంస్థలు చేసిన ఐదు సర్వేల్లో తేలింది.
బీజేపీ ఐదు నుంచి ఆరు స్థానాల్లో గెలుపొందవచ్చని సర్వేలు సూచించగా, అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిందని సర్వేలు సూచించాయి. కాంగ్రెస్‌కు నామమాత్రపు ఓట్లు మాత్రమే లభించినప్పటికీ, బీజేపీకి బలమైన అభ్యర్థులున్న కొన్ని స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కు రెండో స్థానం బీజేపీకి మూడో స్థానం వస్తుందని సర్వేలు చెప్పాయి.
ఈ సర్వేలు రెండు ఫార్మాట్లలో జరిగాయని సమాచారం. ఒకటి టీఆర్‌ఎస్‌పై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను అడిగారు, రెండవది, ప్రతి నియోజకవర్గంలో టీఆరెస్ అభ్యర్థులపై అభిప్రాయాలు అడిగారు. దాదాపు ప్రస్తుత మంత్రులందరూ భారీ మెజారిటీతో గెలుస్తారని ఈ సర్వేలో ప్రజలు తేల్చి చెప్పారు.
రోజువారీ కూలీల నుండి రైతుల వరకు, చిరు వ్యాపారుల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు మధ్య తరగతి సాధారణ ప్రజలందరినీ ఈ సర్వే సంస్థలు ప్రశ్నలడిగాయి. టీఆరెస్ కు మద్దతు తెలపడానికి... ఇంటింటికీ తాగునీరు, రైతులకు 24×7 ఉచిత విద్యుత్ సరఫరా, పారిశ్రామిక దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయడం వంటి కారణాలను చాలా మంది ప్రజలు చెప్పారు. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణ విషయంలో TRS ప్రభుత్వానికి 100 శాతం ఓట్లు పడ్డాయి.
2018 ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారని, తెలంగాణ కోసం కాషాయం పార్టీ చేసిందేమీ లేదని, ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. పైగా కర్ణాటక, మహారాష్ట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందో ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు బెంగళూరులోని సిలికాన్ వ్యాలీని 'హిజాబ్' , 'హలాల్' వివాదాలు నాశనం చేశాయని, బీజేపీ నేతలు కాంట్రాక్ట్ పనులకు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని, ప్రతి పనికీ బిజెపి నాయకులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు, సర్వేల్లో ప్రజలు కేవలం టీఆరెస్ కు మద్దతుగా నిలుస్తున్నారనే విషయమే కాకుండా చాలా మంది టీఆర్‌ఎస్ మంత్రులకు గతంలో కన్నా పెరుగుతున్న మద్దతును కూడా సూచిస్తున్నాయి.అన్ని సర్వేలు కేటీఆర్, టి హరీష్ రావు లు 65 శాతం కన్నా ఎక్కువ ఓట్లను సాధిస్తారని పేర్కొన్నాయి. ఈ లిస్ట్ లో టి పద్మారావు 60 శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావుకు 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ, వేముల ప్రశాంత్‌రెడ్డికి 51-52 ఓట్ల శాతం,ఎస్ నిరంజన్ రెడ్డి ,వి శ్రీనివాస్ గౌడ్ ఇద్దరూ 50 శాతం, అంతకంటే ఎక్కువ ఓటు షేర్లను సాధించనున్నారు. పువ్వాడ అజయ్ కుమార్ 53 శాతం ఓట్లను పొందనున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పొందే ఓట్ల శాతం 53-54 శాతంగా ఉంది.
మరో మంత్రి జి జగదీష్ రెడ్డి బాగా పని చేస్తారని అంచనా వేయబడింది, అతని మెజారిటీ ప్రత్యర్థికన్నా దాదాపు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. సబితా ఇంద్రారెడ్డికి 45-46 శాతం ఓట్లు రాగా, మల్లారెడ్డికి 53-54 శాతం ఓట్లు వచ్చాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి 52-53 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బిగాల గణేష్, హన్మంత్ షిండే, మంత్రి కొప్పుల ఈశ్వర్ లకు గెలుపు ఖాయమని సర్వేలు తేల్చాయి.
నియోజక వర్గాల్లో, మెదక్, ఖమ్మం రెండింటిలో టిఆర్ఎస్ మొత్తం 10 స్థానాలను క్లీన్ స్వీప్ చేయనుండగా, టిపిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో కేవలం 10 శాతం ఓట్ షేర్ మాత్రమే సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సికిందరాబాద్ లో గత ఎన్నికల్లో బిజెపికి చెందిన జి కిషన్‌రెడ్డికి ఓటు వేసి పొరపాటు చేశామని చాలా మంది ఓటర్లు భావించగా, ఆ పార్టీకి చెందిన ఎం రఘునందన్‌రావు కూడా ఈసారి ఓడిపోతారని సర్వేలో తేలింది.