రాష్ట్రవ్యాప్తంగా 51,24,542 ఇళ్లలో సర్వే పూర్తి
ఇంటింటి సర్వే జరుగుతున్న తీరుపై సీఎం సమీక్షలో అధికారుల వెల్లడి
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల సర్వే కొనసాగుతున్నది. ఈ సర్వేను దేశానికి ఆదర్శవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంటింటి సర్వే జరుగుతున్న తీరుపై సీఎం అధికారులతో సమీక్షించారు. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వేను జాప్యంలేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించిన నివాసాలలో మొత్తం 1,16, 14, 349 ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు తెలిపారు. ఈ ఇళ్లలో ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా సమగ్రంగా సర్వే నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు. శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 51,24,542 ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని వివరించారు.
Advertisement