నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థుల నిరసన

సికింద్రాబాద్‌ పీజీ కాలేజీలో ఆందోళనకు దిగిన విద్యార్థులు

Advertisement
Update:2024-11-16 13:11 IST

సికింద్రాబాద్‌ పీజీ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాణ్యతలేని ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. హాస్టల్‌ సరైన భోజన వసతులు కల్పించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వార్డెన్‌కు విద్యార్థుల మధ్య గొడవ తలెత్తడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ నెలకొన్నది. కాలేజీ భవనం ముందు పెద్ద ఎత్తున విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థుల ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులని విద్యార్థులు ప్రశ్నించారు.

రాష్ట్రంలో రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టల్‌లో ఆహారం సరిగా ఉండటం లేదని అనేక సంఘటనలు రుజువు చేశాయి. అయినా ప్రభుత్వ తీరు మారలేదు. ఇటీవల గురుకుల పాఠశాలలో సరైన ఆహారం లేదని, వసతులు లేవని విద్యార్థులు నేషనల్‌ హైవేపై బైఠా యించారు. అత్యుత్తమ విద్యావిధానాన్ని తీసుకొస్తామని రోజు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని పెట్టడం లేదని, కావాలనే గురుకులాలను, ప్రభుత్వ పాఠశాల, కాలేజీలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News