క్యాస్ట్ తప్పుగా నమోదు చేయిస్తే కఠిన చర్యలు : బీసీ కమిషన్‌ ఛైర్మన్‌

కులగణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్‌ చర్యలు తప్పవని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు. కులగణన బృహత్తర కార్యక్రమమని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Update:2024-11-01 20:33 IST

తెలంగాణలో కులగణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. కుల గణన బృహత్తర కార్యక్రమమని.. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాస్తవానికి జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నామని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. అది నిరూపించుకునేందుకు ఈ సర్వే చాలా కీలకం కానుంది. ఈ గణన ద్వారా బీసీలతో పాటు అన్ని కులాల జనాభా లెక్కలు వారి ఆర్థిక స్థితి గతులు తెలుస్తాయి. ఎవ్వరి ఒత్తిళ్లకు కూడా లొంగకుండా మా దృష్టికి వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కులగణన జరుగుతున్న సమయంలో కుల సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు.

సర్వే సక్రమంగా జరిగేవిధంగా చూడాలన్నారు. 80వేల నుంచి 90వేల మంది ఎన్యుమరేటర్లు జనగణనలో పాల్గొంటారని తెలిపారు. దీనిని ఎవ్వరూ కూడా రాజకీయం చేయకూడదని సూచించారు. న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉంది. కోర్టు సూచించినట్టే ముందుకు వెళ్తాం. న్యాయనిపుణల సలహా మేరకు ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగిస్తాం. ప్రజాభిప్రాయ సేకరణలో చాలా రకాల విజ్ఞప్తులు వస్తున్నాయి. కొన్ని కులాల పేర్లు ఎప్పుడూ విననివి కూడా మా దృష్టికి వస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అందరు సహకరించాలి. అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి’’ అని నిరంజన్‌ పేర్కొన్నారు

Tags:    
Advertisement

Similar News