అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి..బ్యాంకు అధికారుల దౌర్జన్యం
జనగామ జిల్లాలో అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు
Advertisement
బ్యాంకులో తీసుకున్న అప్పును తిరిగి కట్టాలని ఓ పేద గిరిజనుల ఇంటి మందు బ్యాంకు అధికారులు దౌర్జన్యం చేశారు. తాజాగా జనగామ జిల్లా పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి ‘మహిళా సంఘం’ సభ్యురాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రుణం తీసు కున్నరు. 61వేలు బ్యాంకుకు బకాయి ఉంది.
దీంతో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వెంకట్‌రెడ్డి, సీసీ సోమనారాయణ, వీవోఏలు రుణం వసూలు కోసం గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు వంటావార్పు చేపడతామని పొయ్యి పెట్టించారు. అప్పు కట్టాలని గత కొంతకాలంగా బ్యాంకు అధికారులు ఆమెను వేడుకుంటున్నట్లు సమాచారం. చివరకు గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు.
Advertisement