ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
సీనియర్ నేత, నాలుగుసార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న మరణంతో ఆయన కుమార్తె లాస్యనందితకు బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. ఈ ఉదయం పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.
సాయన్న వారసురాలిగా అసెంబ్లీకి..
సీనియర్ నేత, నాలుగుసార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న మరణంతో ఆయన కుమార్తె లాస్యనందితకు బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆమెకు పోటీగా కాంగ్రెస్ గద్దర్ కుమార్తెను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిపై లాస్యనందిత భారీ విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.