అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలె

కేంద్ర క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలిగించాలని మంత్రి పొన్నం డిమాండ్

Advertisement
Update:2024-12-19 14:32 IST

కేంద్ర క్యాబినెట్‌ నుంచి అమిత్‌ షాను తొలిగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ అవమానిస్తే బీఆర్‌ఎస్‌ ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. అంబేద్కర్‌పై బీజేపీ వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదానీ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వైఖరిని ఏమిటని మంత్రి ప్రశ్నించారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆధర్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్‌ చేశారు. 

Tags:    
Advertisement

Similar News