కేటీఆర్ పేరుతో సకినాలు.. ఆయన రియాక్షన్ ఏంటంటే..?

ఆ అక్షరాలను వరుసగా పేర్చి కేటీఆర్ కు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ శుభాకాంక్షలకు కేటీఆర్ స్వయంగా స్పందిచారు, ఆ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.

Advertisement
Update:2024-01-15 13:13 IST

పండగ వేళ రాజకీయ నాయకులకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలపడం సహజమే. అయితే ఆ శుభాకాంక్షల్ని అవతలి వారు గుర్తించి బదులివ్వాలంటే మాత్రం కాస్త స్పెషాలిటీ ఉండాల్సిందే. అలాంటి స్పెషాలిటీ చూపించిన ఓ అభిమాని మాజీ మంత్రి కేటీఆర్ నుంచి బదులు అందుకున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడంలో ఇది మంచి క్రియేటివిటీ అని కూడా కేటీఆర్ మెచ్చుకోవడం విశేషం. ఆ ట్వీట్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారాయన.


KTR సకినాలు..

ఇంగ్లిష్ లో కేటీఆర్ అనే అక్షరాలను సకినాల రూపంలో తయారు చేశారు ఓ అభిమాని. ప్రతి అక్షరం చుట్టూ గుండ్రటి సకినం ఉంటుంది. పిండి వంటలు చేసే సమయంలో ఇలా కేటీఆర్ పేరు కనపడేలా తయారు చేశారు, ఆ అక్షరాలను వరుసగా పేర్చి కేటీఆర్ కు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ శుభాకాంక్షలకు కేటీఆర్ స్వయంగా స్పందిచారు, ఆ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.

ఇక పండగ వేళ..

"మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి మీ జీవితంలో అందమైన క్షణాలను అందించాలని, పతంగుల మాదిరిగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను." అంటూ కేటీఆర్ ట్వీట్ వేశారు.

ఈరోజు సంక్రాంతి పండుగే కాదు.. భారత 'ఆర్మీడే' కూడా. భారత 76వ ఆర్మీడే సందర్భంగా కేటీఆర్.. జై జవాన్, జై కిసాన్ అంటూ ట్వీట్ వేశారు. భారత సైనికుల ధైర్యం, క్రమశిక్షణను కొనియాడారు. తెలంగాణకు చెందిన అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని 'ఆర్మీ డే' సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News