లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సీఎం
బర్త్ డే సందర్భంగా ప్రత్యేక పూజలు
సీఎం రేవంత్ రెడ్డి తన బర్త్ డే సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం బహూకరించారు. అనంతరం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ హన్మంతరావు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.